- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంట్లో తెలిసిన ప్రేమ వ్యవహారం.. జంట ఆత్మహత్య
by Bhanu |
రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరి పట్టణ శివారులో రైల్వే ట్రాక్ పై సోమవారం చోటు చేసుకుంది.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భువనగిరి పట్టణ శివారులో రైల్వే ట్రాక్ పై సోమవారం చోటు చేసుకుంది. మృతులను జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నెమలి కొండకు చెందిన మచ్చ శృతి(23), కే వినయ్ కుమార్(25) గా పోలీసులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన వీరివి పక్కపక్క ఇల్లు కావడంతో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ప్రేమ విషయం వీరి పెద్దలకు తెలియడంతో ప్రేమ వివాహానికి నిరాకరిస్తారని అనుమానంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత భువనగిరి శివారులో అనంతారం ఫ్లైఓవర్ కింద సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులకు తెలియడంతో పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
Next Story






