- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేర్వేరు మార్గాల్లో రెండు ప్రమాదాలు.. అతి వేగంతోనే ప్రమాదం
ఆయిల్ లోడుతో సిద్దిపేట నుండి ఖమ్మం జిల్లా తనుఖు వెళుతున్న టాటా ఏస్ వాహనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.

దిశ తిరుమలగిరి: ఆయిల్ లోడుతో సిద్దిపేట నుండి ఖమ్మం జిల్లా తనుఖు వెళుతున్న టాటా ఏస్ వాహనం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా వాహనంలో ఉన్న నూనె పీపాలు రోడ్డు పాలయ్యింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.అదుపుతప్పి బొల్తా కొట్టడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించిన్నట్లు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ మూల మలుపు వద్ద అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలోని రేకులను ఢీకొడుతూ సుమారు 5 బటర్ఫ్లై ఐమాక్స్ లైట్లు స్తంభాలను విరగొట్టుతూ వేగం కంట్రోల్ చేసుకోలేక ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం అయినట్టు మున్సిపల్ పోలీస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనాష్టం జరగలేదని, రోడ్డు మధ్యలోని భారీ గేట్లు విరిగిన శబ్దానికి ఉలిక్కిపడ్డ ప్రజానీకం ప్రమాదం జరిగిన చోటు వద్దకు వచ్చి చూడగా లారీ ప్రమాదంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను,ఇనుప భారీ గేడ్లను రోడ్డుకు పడిపోవడంతో స్థానికులు తొలగించినట్లు తెలిపారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.






