బేగంపేట శివారులో చిరుతపులి సంచారం...?

by Nallavelli.Anjaneyulu |

రాజాపేట మండలం బేగంపేట గ్రామ పరిసర ప్రాంతంలో చిరుత పులి అడుగులు శనివారం గ్రామస్తులు, బావుల కాడి రైతులు గుర్తించారు. దీంతో ఆందోళన చెంది రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా..

బేగంపేట శివారులో చిరుతపులి సంచారం...?
X

దిశ, రాజాపేట: రాజాపేట మండలం బేగంపేట గ్రామ పరిసర ప్రాంతంలో చిరుత పులి అడుగులు శనివారం గ్రామస్తులు, బావుల కాడి రైతులు గుర్తించారు. దీంతో ఆందోళన చెంది రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. బేగంపేట సున్నంపర్రే సమీపంలో చిరుత పులి అడుగు మాదిరి ముద్రలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి తహశీల్దార్ ప్రదీప్, జిల్లా ఫారెస్ట్ అధికారులు చేరుకొని అడుగులను పరిశీలించారు. ఎక్కడ పులి సంచారం జరుగుతోందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతకు ముందు రోజు పక్కనేగల సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుళ్ల, మునిగడప, వెంకటాపురం పరిసర ప్రాంతంలో పులి సంచరించిన అడుగులు రైతులు గ్రామస్తుల ద్వారా ఫారెస్ట్ అధికారులు కనుగొన్నారు. పులి బేగంపేట వైపు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ సంచరించొద్దని, ఒంటరిగా రైతులు కూలీలు వ్యవసాయ క్షేత్రాల కు వెళ్ళవద్దని సూచించారు. పులి అడుగులతో బేగంపేట గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Next Story