ఏప్రిల్ 04న దేవ‌ర‌కొండ‌లో కార్మిక మ‌హాగ‌ర్జ‌న

by Ratna Kumari |

న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఏప్రిల్ 04న నిర్వహించనున్న INTUC మహాసభను విజ‌య‌వంతం చేయాల‌ని నేరేడుగొమ్ము మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు లోక‌సాని కృష్ణ‌య్య పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 04న దేవ‌ర‌కొండ‌లో కార్మిక మ‌హాగ‌ర్జ‌న
X

దిశ, నేరేడుగొమ్ము : న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఏప్రిల్ 04న నిర్వహించనున్న INTUC మహాసభను విజ‌య‌వంతం చేయాల‌ని నేరేడుగొమ్ము మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు లోక‌సాని కృష్ణ‌య్య పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మండ‌ల అధ్య‌క్షుడు కృష్ణ‌య్య‌ను INTUC జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేందర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు పొట్టెపాకు మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి నారోజు సాయిదాచారి, సలహాదారులు అడ్వకేట్ దుగ్గి వెంకన్న, కొత్తపల్లి లింగయ్య లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మ‌హాస‌భ గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం నాయ‌కులు మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం INTUC చేపడుతున్న పోరాటాలకు ఈ మహాసభ దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. దేవరకొండలో జరగబోయే ఈ సభ కార్మిక శక్తి ఏకతను ప్రతిబింబించే చారిత్రాత్మక వేదికగా నిలుస్తుందని తెలిపారు.


మండలంలోని కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేరేడుగొమ్ము మండలం నుంచి భారీగా తరలివెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు ఆరోపించారు. కార్మిక హక్కుల రక్షణకు విఘాతం కలిగించే ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. INTUC మహాసభను విజయవంతం చేయడంలో నేరేడుగొమ్ము మండలం ముందుండాలని నాయకులు ఆకాంక్షించారు.

Next Story