- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రికకు అభినందనీయం
నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రికకు అభినందనీయం అని గుర్రంపోడు మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

దిశ, గుర్రంపోడు : నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రికకు అభినందనీయం అని గుర్రంపోడు మాజీ ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం దిశ దినపత్రిక 2026 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ ఎప్పటి వార్తలు అప్పుడే ప్రజలకు అందిస్తూ.. నిజాలను నిర్భయంగా రాస్తున్న దిశ దినపత్రిక పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను వేగంగా, స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో దిశ దిన పత్రిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో కూడా ప్రజా సమస్యలపై దిశ దినపత్రిక మరింత బలంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉపసర్పంచ్ మంచికంటి ప్రసాద్ కుమార్, మాజీ సర్పంచులు గట్టుపల్లి మణిపాల్ రెడ్డి, రంగరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






