కొండ‌ప‌ల్లేప‌ల్లి సంత బ‌హిరంగ వేలం

by Nallavelli.Anjaneyulu |

కొండ‌మ‌ల్లేప‌ల్లి ప‌శువుల బ‌హిరంగ వేలానికి ముహూర్తం ఖ‌రారు అయింది.

కొండ‌ప‌ల్లేప‌ల్లి సంత బ‌హిరంగ వేలం
X

దిశ‌, కొండ‌మ‌ల్లేప‌ల్లి : కొండ‌మ‌ల్లేప‌ల్లి ప‌శువుల బ‌హిరంగ వేలానికి ముహూర్తం ఖ‌రారు అయింది. మార్చి చివ‌రి వారంలో సంత నూత‌న కాంట్రాక్ట‌ర్ కి ఇవ్వాల‌ని గ్రామ‌పంచాయ‌తీ సానుకూలంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 01, 2026 నుంచి 2027 మార్చి 31 వరకు కాంట్రాక్టు ఇవ్వాలని కొండమల్లేపల్లి గ్రామ సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి, కొండమల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి డాకూ నాయక్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క‌ట‌న గ్రామ‌పంచాయ‌తీ వ‌ద్ద నోటీస్ బోర్డులో ఉంచారు. 2026 - 27 సంత కాంట్రాక్టు దక్కించుకోవాలనుకున్న వాళ్లు కచ్చితంగా ఈనెల 25న సంత వేలంలో పాల్గొనాలి. ఈ వేలంలో పాల్గొనాలనుకున్నవాళ్లు ఎమ్మార్వో స్వీకరించిన రూ.5 ల‌క్ష‌ల సాల్వెంట్స్ సర్టిఫికెట్ తో పాటు రూ. 10 లక్షలు డీడీ ఈనెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు గ్రామపంచాయతీకి చెల్లించాలి. ఈ వేలంలో పాల్గొనాల‌నుకునే వారికి గ్రామపంచాయతీలో ఎలాంటి పెండింగ్ బిల్లు ఉండకూడదని తెలిపారు. ఇంటి బిల్లు కరెంట్ బిల్లు ఇంటి పనులు లాంటివి పెండింగ్ లో ఉండకూడదని వివ‌రించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో నియమ, నిబంధనలతో ఏది ఏమైనా గ్రామపంచాయతీలో అవినీతికి అక్రమాలకు తావు ఉండదనీ సర్పంచ్ పసునూరి యుగంధర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Next Story