- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు ప్రేమ వివాహం.. తండ్రికి మరణానికి యమపాశం ..!
by Bhanu |
కొండమల్లేపల్లి పట్టణ శివారులో సీసీ తండాకు వెళ్ళు రోడ్డు వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంతో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పట్టణ శివారులో సీసీ తండాకు వెళ్ళు రోడ్డు వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంతో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే నేరడుగొమ్ము మండలం పేర్వల గ్రామానికి చెందిన ఎరుకల యాదయ్య గౌడ్ తన స్వగ్రామంలోనే వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల తన కొడుకు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో.. ఇట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని సమాజం తన గురించి పరిపరి విధాలుగా మాట్లాడుకుంటారని ఆగౌరవానికి లోనై కొండమల్లేపల్లి పట్టణ శివారులో నిర్మానుష స్థలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్టి విషయం పై మృతుడి భార్య ఎరుకల కృష్ణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.
Next Story






