గుంతలు పడి ప్రమాదకరంగా మారిన రోడ్ల‌ను రిపేరు చేయండి : రాజగోపాల్ రెడ్డి

by velandi.Saikiran |

అధిక వర్షాల వల్ల దెబ్బతిన రోడ్లని వెంటనే రిపేరు చేయాలని, గుంతల మయంగా మారి ప్రమాదకరంగా మారిన రోడ్లను గుర్తించి

గుంతలు పడి ప్రమాదకరంగా మారిన రోడ్ల‌ను రిపేరు చేయండి : రాజగోపాల్ రెడ్డి
X

దిశ, మునుగోడు : అధిక వర్షాల వల్ల దెబ్బతిన రోడ్లని వెంటనే రిపేరు చేయాలని, గుంతల మయంగా మారి ప్రమాదకరంగా మారిన రోడ్లను గుర్తించి వాటిని పూడ్చివేయాలని, వర్షాల వల్ల ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మునుగోడు శాసనసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో యాదాద్రి, నల్గొండ జిల్లాల ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి నియోజకవర్గంలో ఇప్పటికే 700 కోట్ల రూపాయలతో 221 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

మరో 343 కోట్ల వ్యయంతో 120 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులు మంజూరు దశలో ఉన్నాయని, మరొక 170 కోట్ల వ్యయంతో 4రోడ్లను హెచ్ఏఎం రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రపోసల్స్ పంపించామన్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఇప్పటికే 254 కోట్ల వ్యయంతో 75 రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, మరొక 262 కోట్ల వ్యయంతో 58 రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ కలుపుకొని 1500 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో రోడ్ల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు.

రాబోయే కాలంలో మరో 1500 కోట్ల రూపాయలు రోడ్లకు నిధులు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వీటితో మునుగోడు నియోజకవర్గంలోని రోడ్డు నెట్వర్క్ రూపురేఖలన్నీ మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మూడు నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ డ్యూటీ నారాయణ, యాదాద్రి, నల్గొండ జిల్లాల అధికారులు, ఏడు మండలాలకు చెందిన ఆర్అండ్బి పంచాయతీరాజ్ అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story