బ్రిడ్జి పనులకు త్వరలో శంకుస్థాపన : మంత్రి కోమటిరెడ్డి

by Bhanu |

సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించబోయే బ్రిడ్జికి త్వరలో శంకుస్థాపన చేస్తామంటూ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డికి హామీ ఇచ్చారు.

బ్రిడ్జి పనులకు త్వరలో శంకుస్థాపన : మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామ శివారులో నూతనంగా నిర్మించబోయే బ్రిడ్జికి త్వరలో శంకుస్థాపన చేస్తామంటూ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డికి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మంత్రిని ప్రత్యేకంగా కలిసి శిథిలావస్థ వంతెన గురించి వివరించారు. పాలేరు ఏటిపై 70 ఏళ్ల క్రితం నిర్మించిన రాతి నిర్మాణ పురాతన వంతెన నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని వివరించారు. ముఖ్యంగా బ్రిడ్జి మీదుగా సూర్యాపేట, వరంగల్, మహాబూబాబాద్ జిల్లాల వైపు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయని తెలిపారు.


అయితే గత ఏడాది వరదలకు వంతెన పిల్లర్ల పునాదులు ప్రమాదకర స్థితికి చేరడమే కాకుండా స్లాబ్ కింద హెచ్చులు ఊడి పడుతూ సువ్వలు వేలాడుతున్నాయని తెలి తెలిపారు. పిల్లర్లు సక్రమంగా లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, దీంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు గిరిధర్ రెడ్డి వివరించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తానని చైర్మన్ గిరిధర్ రెడ్డికి హామీ ఇచ్చారు.మంత్రిని సన్మానించారు.


Next Story