పదేళ్ల కాలంలో కేసీఆర్ అక్రమాలు ఎన్నో : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Bhanu |

పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకు ఫలితంగా తెలంగాణను ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చారని ఆర్ అండ్ బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

పదేళ్ల కాలంలో కేసీఆర్ అక్రమాలు ఎన్నో : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, మిర్యాలగూడ : పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, అందుకు ఫలితంగా తెలంగాణను ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల తెలంగాణగా మార్చారని ఆర్ అండ్ బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కెసిఆర్ సొంత బిడ్డే చుట్టూ దయ్యాలు ఉన్నట్లు చెబుతున్న ఆయనకు జ్ఞానోదయం కలగడం లేదని అన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో కట్టనివ్వబోమని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఆయన అన్నారు.


పేదోడి ఇంటికలను నెరవేర్చడం కోసం ఐదేళ్ల కాలంలో ఐదు లక్షల ఇండ్లను పూర్తి చేస్తామని అన్నారు. తాను మంత్రి అయ్యాక ఉమ్మడి జిల్లాకు 1600 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే శ్రీశైలం టెంన్నల్ పనులను పూర్తి చేసి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బిఆర్ఎస్ డైరెక్షన్ లోనే ప్రభాకర్ రావు దాక్కున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం వలన బయటకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఉన్నారు.

Next Story