- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి 12 ఏళ్లు జైలు శిక్ష
ప్రేమ పేరుతో వేధించి, ఓ యువతి ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాల గూడెం గ్రామానికి చెందిన ఓ యువతిపై, అదే మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రావణ్ ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడు.

దిశ, నల్లగొండ క్రైం: ప్రేమ పేరుతో వేధించి, ఓ యువతి ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాల గూడెం గ్రామానికి చెందిన ఓ యువతిపై, అదే మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రావణ్ ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడు. ఆ యువతి ఫోన్ నెంబర్ తీసుకుని మెసేజ్ లు చేస్తున్నాడు. 2023 ఆగస్టు 9న కదిరె మౌనిక (20)న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శ్రావణ్ వచ్చి ప్రేమించాలని బలవంతం చేశాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో మౌనిక కేకలు వేయడంతో, స్థానికులు వచ్చి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకోవడంతో మనస్థాపం చెంది, అదే రోజు గడ్డి మందు తాగింది.
కుటుంబీకులు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 11న మృతి చెందింది. ఆమె తండ్రి కదిరె శంకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి కనగల్ ఎస్ఐ అంతిరెడ్డి, చండూరు సీఐ వెంకటయ్య ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటినుంచి కోర్టులో ఈ కేసు వాయిదాలపై నడుస్తూ శుక్రవారం ఫైనల్ కు వచ్చింది. నల్లగొండ ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ కేసు పూర్వాపరాలను పరిశీలించి శ్రావణ్ ను నేరస్థుడిగా పరిగనించి 12 సంవత్సరాల 6నెలల జైలు శిక్ష, 17వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. అదనపు పీపీ జవహర్ లాల్, చండూరు సీఐ ఆదిరెడ్డి, కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, సీడీవో నగేష్, కోర్టు లైజనింగ్ అధికారులు పి.నరేందర్, ఎన్ మల్లిఖార్జున్ ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.






