ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరికలు..

by Disha Web Desk 20 |
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఎస్పీలో చేరికలు..
X

దిశ, హాలియ : సాగర్ నియోజక వర్గంలోని పలుపార్టీల నాయకులు శనివారం బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాగర్ నియోజక వర్గం అద్యక్షుడు ఆదిమల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి ఎంఎస్ఎఫ్ లో కీలకంగా పనిచేసిన ముదిగొండ. వెంకటేశ్వర్లు తన అనుచరులు సుమారు 50మందితో హైదరాబాద్ లోని బీఎస్పీ పార్టీ ఆఫీసులో కండువా కప్పుకొని పార్టీలో చేరారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీని సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా శక్తి వంచన లేకుండా తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. రాబోయే రోజులలో నియోజకవర్గ వ్యాప్తంగా బీజీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను బీఎస్పీ పార్టీలో చేరేవిధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు తంగేళ్ల.సత్యనారాయణ రాజు, పెద్దవూర మండల అధ్యక్షులు కుక్కమూడి.ముత్యాలు, గుర్రంపోడు మండల అధ్యక్షులు కొమ్ము.రమేష్, పార్టీ సీనియర్ నాయకులు తక్కేలపల్లి.శ్రీనువాసు తదితరులు పాల్గొన్నారు.



Next Story