జేఈఈలో ప్రతిభ చూపిన నడిగూడెం మండల విద్యార్థి..ఆల్ ఇండియా 110వ ర్యాంక్

by Bhanu |

నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామానికి చెందిన ఆరె. ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించి ప్రతిభను చాటాడు.

జేఈఈలో ప్రతిభ చూపిన నడిగూడెం మండల విద్యార్థి..ఆల్ ఇండియా 110వ ర్యాంక్
X

దిశ, నడిగూడెం : నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామానికి చెందిన ఆరె. ప్రణీత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించి ప్రతిభను చాటాడు. అలాగే, జేఈఈ మెయిన్స్‌లో 462వ ర్యాంక్, ఎప్‌సెట్ రాష్ట్ర స్థాయిలో 41వ ర్యాంక్‌ను సాధించిన ప్రణీత్ విద్యలో తన ప్రతిభను రుజువుచేశాడు. ప్రణీత్ తన ప్రాథమిక విద్యను కోదాడలో, ఇంటర్మీడియట్‌ను విజయవాడలో పూర్తి చేసి, 984 మార్కులు సాధించాడు. తన లక్ష్యం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడమేనని ప్రణీత్ తెలియజేశాడు. ప్రణీత్ తండ్రి అనంతగిరి మండలం పాలారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి వెంకట రమణ గృహిణి. అక్క ప్రజ్ఞ శ్రీ బిలాయ్ ఐఐటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) తృతీయ సంవత్సరం చదువుతోంది. జాతీయ స్థాయిలో కరివిరాల గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ప్రణీత్ రెడ్డిని ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.




Next Story