- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ స్థాయిలో సత్తా చాటిన జయ పాఠశాల
దిశ, సూర్యాపేట : రామానుజన్ గణిత అకాడమి రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్ ఫైనల్ లెవల్

దిశ, సూర్యాపేట : రామానుజన్ గణిత అకాడమి రామచంద్రాపురం వారు నిర్వహించిన గణిత ఒలంపియాడ్ ఫైనల్ లెవల్ లో జయ ఐఐటి ఒలంపియాడ్ పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు జాతీయ, జిల్లా ర్యాంకులను సాధించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ ర్యాంకర్లను అభినందించారు. 5వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంకు యం.హశ్విత్ జిల్లా రెండవ ర్యాంకు బి. జోష్ణతేజ్ సాధించారు. అలాగే 6వ తరగతి నుంచి జిల్లా మొదటి ర్యాంకు బి. వివేకవర్థన్ జిల్లా రెండవ ర్యాంకు జి.అభయ్, 7వ తరగతి నుండి జిల్లా రెండవ ర్యాంకు జి.సాయిలోకేష్వై. వీక్షణ సాధించారు. 8వ తరగతి నుండి ఆన్ఇండియా మొదటి ర్యాంకు డి.కార్తికేయరెడ్డి, 9వ తరగతి నుండి జిల్లా మొదటి ర్యాంకు వై.వీక్షణ, వి.గౌతమ్ రెండవ ర్యాంకు వి.జయసూర్య, 10వ తరగతి నుంచి ఆలిండియా మొదటి ర్యాంకు ఆర్.రోమ్యానంద్ జిల్లా మొదటి ర్యాంకు వి. వైష్ణవి, డి. శ్రీహర్ష ఆర్.విష్ణువర్థన్, జి.షశాంత్ సాధించారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, తోడ్పడిన తమ ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ బింగి జ్యోతి అబినందించారు. తమకు సహాయ, సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.






