- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే ఏడాదిలోపు క్రికెట్ గౌండ్ ఏర్పాటు చేస్తా : జాలే నర్సింహారెడ్డి
వచ్చే ఏడాదిలోపు మండలంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని పీసీసీ, పీఏసీఎస్ చైర్మన్ జాలే నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

దిశ, చందంపేట : వచ్చే ఏడాదిలోపు మండలంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని పీసీసీ, పీఏసీఎస్ చైర్మన్ జాలే నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బుడ్డోనితండా రక్షక్ దళ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జాలే నర్సింహారెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంత క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఉత్సాహ భరీతంగా కొనసాగిన టోర్నమెంట్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆటలు సాధారణంగా మానసిక ఉద్దీపన శారీరక ఉద్దీపన లేదా రెండిటిని కలిగి ఉంటాయి. చాలా ఆటలు ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి వ్యాయామం ఒక రూపంగా పని చేయడానికి లేదా విద్యా అనుకరణ లేదా మానసిక పాత్రను నిర్వహించడానికి ఆటలు సహాయపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్టెమ్మ లాల్ సింగ్ నాయక్, ఉప సర్పంచ్ లు తార తుల్జా, పెద్దమ్మ శ్రీనయ్య, రెండవ బహుమతి దాత M హనుమంత్, మాజీ సర్పంచ్ లు ముడవత్ బాలు లావుధ్య బాలు, మాజీ ఉప సర్పంచ్ లు యాదయ్య, N బాలు, చాట్ల వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, వెంకటాచారి, దేవుని అంకుల్, S వెంకటయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, ఆర్గనైజర్స్ గ్రామ రక్షక్ దళ్ యూత్ అసోసియన్ సభ్యులు, పాల్గొన్నారు.






