చదివిన పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం సంతోషకరం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

by Ratna Kumari |

"నేను విద్యనభ్యసించిన పలివెల పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉంది" అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.

చదివిన పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం సంతోషకరం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
X

దిశ, మునుగోడు : "నేను విద్యనభ్యసించిన పలివెల పాఠశాలకే ఎమ్మెల్సీ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉంది" అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పలివెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య హాజరై మాట్లాడారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఈ పాఠశాలలో జరిగిన సపరిపాలన దినోత్సవ సందర్భంగా తాను డీఈవో గా పాత్ర పోషించానన్నారు. తాను చదువుకునే రోజుల్లో హిందీ ఉపాధ్యాయుడు లేని బాధను అనుభవించామ‌ని తెలిపారు.

ఈ పాఠశాలకు తెలుగు ఉపాధ్యాయుని నియమించేందుకు ఎమ్మెల్సీ గా కృషి చేశానన్నారు. పలివెల పాఠశాలకు చాలా ప్రాముఖ్యత ఉందని, పలివెల పాఠశాలలో చదువు కోకపోతే ఎమ్మెల్సీగా కాకపోయేవానినన్నారు. మేము చెట్ల నీడలో చదువుకొని ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే చైతన్యవంతులు అవుతారన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణ అయి వ్యాపార రంగంగా మారాయన్నారు. పలివెల పాఠశాల అభివృద్ధి కోసం నా సొంత నిధుల నుంచి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పదో తరగతిలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాధగోని సాయిలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story