- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ్మారంలో భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరికీ తీవ్రగాయాలు
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గ్రామంలో గడ్డం నర్సిరెడ్డి, సేనారెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు తీవ్ర ఘటనకు దారి తీసింది.

దిశ, చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. గ్రామంలో గడ్డం నర్సిరెడ్డి, సేనారెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు తీవ్ర ఘటనకు దారి తీసింది. ఇటీవల తమ్మారం గ్రామ సర్పంచ్‌గా హనుమయ్య గెలుపొందిన నేపథ్యంలో ఈ వివాదాలు మరింత తీవ్రతరం అయ్యాయని తెలుస్తోంది.ఈ క్రమంలో హనుమయ్య వర్గానికి చెందిన సురాగాని మహేష్, తిమ్మిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, శ్రీకాంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు. గొడవలో భాగస్వాములైన ఇతరులను కూడా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా 25 మంది పోలీసులతో పికెటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






