ఏకగ్రీవ పంచాయతీల్లో ప్రవర్తన నియమావళి ఎన్నికల అమలు

by Ratna Kumari |

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ఏకగ్రీవ గ్రామపంచాయతీలలో సైతం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏకగ్రీవ పంచాయతీల్లో ప్రవర్తన నియమావళి ఎన్నికల అమలు
X

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : ఏకగ్రీవ గ్రామపంచాయతీలలో సైతం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదిని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆమె చెప్పారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టేజ్ 2, జోనల్ అధికారులకు శిక్షణ, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై కమిషనర్ ఆయా జిల్లాల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్ల పై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాల పట్ల ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు. ఫారం - 10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారిణి కొర్రా లక్ష్మీ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పి సీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

Next Story