బీసీ గురుకుల విద్యార్థినీలకు అస్వస్థత

by Disha Web Desk 11 |
బీసీ గురుకుల విద్యార్థినీలకు అస్వస్థత
X

దిశ, నేరేడుచర్ల : మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు నలుగురు అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గురువారం జరిగింది. స్థానికులు డాక్టర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .తెలంగాణ మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ పాలకవీడు మండలంలోని గుడు గుంట్లపాలెం పేరుతో గత ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. అక్కడ ఆ స్కూలుకు సంబంధించిన భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం దానిని నేరేడుచర్ల మండలంలోని రామగిరి గ్రామంలోని వివిఆర్ స్కూల్ భవనాన్ని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు.

అందులో ఐదో తరగతి చదువుతున్న సంజన ,లావణ్య , ప్రణీత , వసంత రాణి అనే నలుగురు విద్యార్థులకు ఈరోజు ఉదయం వాంతింగ్ కావడం జరిగింది . పాఠశాలలో ఉన్న వార్డెన్ విద్యార్థులకు మెడిసిన్ ఇచ్చింది. మధ్యాహ్నం వరకు విద్యార్థినీలకు వాంతింగ్ లు తగ్గకపోవడం నీరసంగా ఉండడంతో నేరేడుచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇది ఫుడ్ పాయిజన్ వల్ల అయిందా...! లేక ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వల్ల ఇలా జరిగిందా ..!అని డాక్టర్ నిర్ధారించ లేకపోతున్నారు. ప్రస్తుతం విద్యార్థినీలకు హాస్పిటల్ లో చికిత్స చేయించారు.ప్రస్తుతం విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉండడంతో వారిని తిరిగి పంపించామని డాక్టర్ తెలిపారు.


Next Story

Most Viewed