గంజాయి అక్ర‌మ ర‌వాణా.. నిందితులు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ, హాలియా : మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు విక్రయించడం అలవాటు చేసుకున్న పలువురు యువకులను హాలియా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

గంజాయి అక్ర‌మ ర‌వాణా.. నిందితులు అరెస్ట్
X

దిశ, హాలియా : మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి గంజాయి సేవించడంతోపాటు విక్రయించడం అలవాటు చేసుకున్న పలువురు యువకులను హాలియా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం హాలియా పోలీస్ స్టేషన్ లో నిర్వ‌హించి విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలను వెల్లడించారు. హాలియా పట్టణానికి చెందిన మహమ్మద్ రియాజ్ బాబా ( బైక్ మెకానిక్), సల్ల అజయ్ (సెల్ ఫోన్ మెకానిక్), షేక్ జి షాన్ హుస్సేన్( విద్యార్థి), అమరవరపు జేమ్స్ (పెట్రోల్ పంపు వర్కర్), కేశమల్ల అంజి (డీజే ఆపరేటర్) వీరంద‌రూ స్నేహితులు. వీరు గంజాయికి అలవాటు పడటంతో ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన చల్లా చిన్న ఆంజనేయులు అలియాస్ బడా అంజి చల్లా పెద్ద ఆంజనేయులు అలియాస్ మ్యాక్స్ లు గత కొంతకాలంగా ఆంధ్ర ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి హాలియాలోని సదరు స్నేహితులకు విక్రయిస్తున్నారు. నిందితులు గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు అలవాటు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో హాలియా సీఐ సతీష్ రెడ్డి, ఎస్సై బండి సాయి ప్రశాంత్ ల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించడంతో మంగళవారం పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన గంజాయి విక్రేతలు చిన్న ఆంజనేయులు అలియాస్ బడా అంజి, పెద్ద ఆంజనేయులు అలియాస్ మ్యాక్స్ లు పల్సర్ బైక్ పై సుమారు 1200 గ్రాములు రూ.30వేలు విలువ చేసే గంజాయిని హాలియా కు తీసుకువస్తుండగా మండలంలోని అల్వాల అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారు.


దీంతో నిందితులను పట్టుకునే ప్రయత్నంలో చల్లా చిన్న‌ ఆంజనేయులు పరారయ్యారు. సమాచారం మేరకు గంజాయి సేవిస్తున్న హాలియా కు చెందిన మహమ్మద్ రియాజ్ బాబా, సల్లా అజయ్, షేక్ జిశాన్ హుస్సేన్, చల్ల ఆంజనేయులను అరెస్టు చేయగా చల్లా పెద్ద ఆంజనేయులు, అమరవరం జేమ్స్, కేశమల్ల అంజిలు పరారయ్యారు. నిందితుల నుండి1200 గ్రాముల గంజాయి టీఎస్ 05 ఎఫ్ 6454 నంబర్ గల పల్సర్ బైక్ , నాలుగు సెల్ ఫోన్లు, రూ 2వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తనలో భాగంగా గంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయించినా సేవించినా వెంటనే పోలీసులకు తగిన సమాచారం అందించాలని తెలిపారు. అంతేకాకుండా గంజాయికి అలవాటు పడుతున్న తమ బిడ్డలను సక్రమ దారిలో నడిపించేందుకు తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని గంజాయికి అలవాటు పడిన యువతను మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసును చేదించిన సిఐ సతీష్ రెడ్డి, ఎస్సై బండి సాయి ప్రశాంత్ లను ఆయన అభినందించారు.

Next Story