కాంతిలో కాసుల దందా.. మల్లేపల్లి సంతలో కరుణాహీన వాస్తవం

by Bhanu |

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పశువులను సంతల్లో నుంచి కోతకు విక్రయించడం చట్టపరంగా నిషేధితమే.

కాంతిలో కాసుల దందా.. మల్లేపల్లి సంతలో కరుణాహీన వాస్తవం
X

దిశ, నల్లగొండ బ్యూరో : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పశువులను సంతల్లో నుంచి కోతకు విక్రయించడం చట్టపరంగా నిషేధితమే. కానీ నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లి సంతలో మాత్రం ఈ నిబంధనలు అక్షరాలా ఉల్లంఘించబడుతున్నాయి. ప్రతివారం జరిగే ఈ సంతలో వ్యవసాయ పనులకు అవసరమైన పశువుల విక్రయమే జరగాలని నిబంధనలున్నా, అధికశాతం పశువులు కళేబాలకు పంపబడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బే లక్ష్యం..!

నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారి పైనే ఉన్న ఈ సంతకు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే అక్కడ చూడదగ్గ దృశ్యం ఏమిటంటే.. చిన్న దూడల నుంచే గేదెల వరకు ఏవైనా సరే డిసిఎం వాహనాల్లో బలవంతంగా ఎక్కించబడి కళేబాల దారిని పట్టినట్టు కనిపిస్తోంది.

స్థానికుల విన్నపాల ప్రకారం, సంతలో విక్రయమయ్యే పశువుల్లో కనీసం 30–40 శాతం వరకు కోత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ వ్యాపారం వెనుక పెద్ద మోసం జరుగుతోందని వారికి సందేహం.

కాంట్రాక్టర్‌కు రేట్లు ఫిక్స్..!

సంత నిర్వహణ బాధ్యత ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్ వ్యవహారం విషమంగా మారిందని సమాచారం. ‘‘సంతను రూ.1.85 కోట్లతో దక్కించుకున్నాం… ప్రభుత్వం చెప్పినట్టు నడిస్తే ఆదాయం వస్తుందా?’’ అని ఓ రహదారి రిసిప్టు ఎజెంట్ వ్యాఖ్యానించిన తీరు ఆందోళన కలిగిస్తోంది.

‘‘కలేబాలకు పంపే ప్రతి పశువు నుంచి వసూలు చేస్తాం… అధికారులు, నాయకులకు ముట్టజెబుతాం… ఇవ్వకపోతే సంత నడవనిస్తారా?’’ అంటూ ధీమాగా మాట్లాడటం పశు సంక్షేమంపై ప్రభుత్వ పాలనను ప్రశ్నించేలా చేస్తోంది.

అధికారుల మౌనమే అండగా.?

సంతలో జరిగే ఈ అక్రమాలను అన్ని శాఖల అధికారులు చూస్తూనే ఉన్నప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా, వాటిని అమలు చేసే శక్తి రంగస్థలంలో కనిపించకపోవడం వేదన కలిగిస్తోంది. ఇలాంటి తార్కిక లాజికుతో అక్రమాలు నడవడమే కాదు, పాలక వ్యవస్థపై అవిశ్వాసాన్ని పెంచుతోంది. అధికారుల కదలికలకోసం చూస్తున్న ప్రజలు ఈ దందాకు ఎప్పటికి చెక్ పడుతుందో తెలియని నిరాశలో ఉన్నారు.

Next Story