నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్న.. Uttam Kumar Reddy

by Disha Web Desk 13 |
నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్న.. Uttam Kumar Reddy
X

దిశ, నేరేడుచర్ల/హుజూర్‌నగర్: సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన హుజూర్‌నగర్ మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్ పర్సన్ దొంతగాని లక్ష్మమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ దొంతగాని పద్మ, లింగగిరి ఎంపీటీసీ జయమ్మ, మాజీ బీఆర్ఎస్ నాయకులు కడియాల రామకృష్ణ ఆదివారం సాయంత్రం నల్గొండ ఎంపీ, హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండవ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వీరందరూ గత వారం రోజుల క్రితం ముక్కుమడిగా పార్టీకి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. జరగనున్న ఎన్నికలలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా తను గెలవబోతున్ననని దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నారని ఇప్పటికే చాలామంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కొందరు పార్టీ మారే పరిస్థితి లేదని కానీ ఆ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారని తెలిపారు. కర్ణాటకలో ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టిన హమీలంన్నింటిని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దానిని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారు ఎన్ని ప్రచారలు చేసిన ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని.. వారిని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎరగాని నాగన్న గౌడ్, సీనియర్ నాయకులు ఈడుపుగంటి సుబ్బారావు, అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, పలువురు కౌన్సిలర్లు నాయకుడు పాల్గొన్నారు.

Next Story

Most Viewed