సూర్యాస్తమయంలో భార్య, భర్తల కలయిక వల్ల ఇన్ని అనర్ధాలా..!

by Kavitha |
సూర్యాస్తమయంలో భార్య, భర్తల కలయిక వల్ల ఇన్ని అనర్ధాలా..!
X

దిశ,ఫీచర్స్: ప్రతిరోజూ ఉదయం లేవగానే మనం సూర్య నమస్కారం చేస్తాము. ఆ సూర్యుడిని ఆదిత్య దేవుడిగా పూజిస్తాము. అయితే సూర్యోదయానికి ముందే అన్ని పనులు చేయాలని, తర్వాత చేయడం వల్ల కీడు సంభవిస్తుందని పండితులు చెబుతారు. అందులో ముఖ్యంగా సూర్యాస్తమయంలో దంపతులు కలయిక. దీని వల్ల పెద్ద ప్రమాదమే ఉండనుందట. అదేంటో మనం ఇక్కడ చూద్దాం.

రోజువారీ చేసే పనులు ఒక క్రమ పద్ధతిలో చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు కానీ అలా కాకుండా సమయ పాలన లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల కలయిక అనేది చీకటి తరువాతనే చేయాలని అలా కాకుండా సూర్యాస్తమయంలో కలవడానికి ప్రయత్నించిన లేదా కలిసిన వచ్చే జన్మలో వారు జంతువుగా పుడతారట. అంతేకాకుండా వారికి పుట్టే బిడ్డ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారట. దానితో పాటు గోర్లు కత్తిరించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.. వేద శాస్త్రాలు చదవకూడదట.. జుట్టును కూడా ఈ సమయంలో కత్తిరించకుండా ఉండాలి. ఈ సమయంలో నిద్రపోకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంట. హిందూ మత గ్రంథం ప్రకారం ఈ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాల పాలవుతారని అంటున్నారు.

అసలు సూర్యస్తమయంలో ఏ పనులు చేస్తే లాభం కూరుతుంది అంటే.. ఈ సమయంలో ధ్యానం పాటించవచ్చు.. వీలైతే ప్రత్యేక పూజలు చేయొచ్చు అని చెబుతున్నారు.

Read More..

కర్రోడా అని పిలిచినందుకు విడాకులిచ్చిన భర్త.. అసలు కథేంటి అంటే..



Next Story