- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
AP Politics: ఏపీలో వెలుగు చూసిన పొలిటికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అటు పాలకపక్షం మీద ఇటు ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, అలానే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి విడిపోయి నేటికి పది సంవత్సరాలు అయిందని, కానీ ఇప్పటికీ మనకు ప్రత్యేక హోదా లేదని మండిపడ్డారు. పది సంవత్సరాల క్రితమే మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే నేడు ప్రతి నియోజకవర్గంలో 50 నుండి వంద కొత్త కంపెనీలు వచ్చేవని అని పేర్కొన్నారు. అదే జరుగుంటే ఇవాళ మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేది అని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా గురించి ఊసెత్తలేదని షర్మిల దుయ్యబట్టారు.
నేడు పాలక పక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు ఇద్దరు కూడ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరూ మోడీతో పొత్తులు తొత్తులుగా తప్ప ఎవరైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి మోడీతో బహిరంగ పొత్తు ఉందని, ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోడీతో ఉన్నది అక్రమ పొత్తు అని, ఇద్దరికీ ఏం తేడా లేదని దుయ్యబట్టారు.
ఈ రోజు నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళుగా మారారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, నేడు చంద్రబాబు, జగన్ మోడీ కొంగు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని ఎద్దేవ చేశారు. మోడీ మనకు ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏదీ ఇవ్వలేదని, అయినా అయనకు చంద్రబాబు, జగన్ గులాంగిరీ చేస్తున్నారని మండిపడ్డారు.
Read More..