- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. ఏకంగా 3 కిలోమీటర్లు
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సూర్యపేట జిల్లా, కేతెపెల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. క్రిస్మస్, వారాంతాలు కలిసి రావడంతో సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు తిరిగి పట్నం బాట పట్టారు. వాహనాల రద్దీ పెరగడంతోపాటు రోడ్డు విస్తరణ పనులు, టోల్ చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ట్రాఫిక్ నత్తనడకన కదులుతోంది. చిట్యాల, చౌటుప్పల్, నార్కట్‌పల్లి ప్రాంతాల వద్ద కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు, NHAI సిబ్బంది రంగంలోకి దిగగా, అదనపు టోల్ గేట్లు తెరిచి వాహనాలను వేగంగా పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story






