- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని శివన్నగూడ గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, మర్రిగూడ : షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని శివన్నగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఐతరాజు మారయ్య నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేనందున ప్రాణనష్టం తప్పింది. ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న బట్టలు, గృహోపకరణాలు సామాగ్రి కాలిపోయి ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. అనాధ అయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.
Next Story






