- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున సాగర్లో భారీగా ట్రాఫిక్ జాం
by Muthe.Rajitha |
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా ఉన్న నాగార్జున సాగర్(Nagarjuna Sagar) చూసేందుకు రెండు రాష్ట్రాల పర్యాటకులు భారీగా తరలిరావడంతో సాగర్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండుకుండలా ఉన్న నాగార్జున సాగర్(Nagarjuna Sagar) చూసేందుకు రెండు రాష్ట్రాల పర్యాటకులు భారీగా తరలిరావడంతో సాగర్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. వారాంతాలు కావడంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రా నుంచి భారీగా పర్యాటకులు సాగర్ అందాలు చూసేందుకు ఎగబడ్డారు. దీంతో నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ నుంచి కొత్త బ్రిడ్జి వరకు పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే వారు లేకపోవడంతో.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఎండలో నానా కష్టాలు పడ్డారు.
Next Story






