- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఉద్యోగిపై డాక్టర్ వేధింపులు.. తట్టుకోలేని ఆమె..
మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీపై డాక్టర్ వేధింపులు భరించలేక తీవ్రంగా డిప్రెషన్‌కు గురై డ్యూటీలో ఉన్న సమయంలో కుప్పకూలిన ఘటన కలకలం రేపింది.

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీపై డాక్టర్ వేధింపులకు పాల్పడుతున్నాడు. వాటిని భరించలేక తీవ్రంగా డిప్రెషన్‌కు గురైన ఆమె డ్యూటీలో ఉన్న సమయంలో ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డాక్టర్ వేధింపులపై కుటుంబ సభ్యులు జిల్లా వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం డిప్యూటీ డిఎంహెచ్వో మాధవ్ కుమార్ మేళ్లచెరువు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని, సిబ్బందిని విచారించారు. డాక్టర్, సిబ్బంది మధ్య నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, అక్కడికి చేరుకున్న బాధితురాలి బంధువులు డాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. వారికి అధికారి ఇచ్చిన హామీతో బంధువులు శాంతించారు.






