- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది : PDSU
దిశ, తిరుమలగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని PDSU మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట నాగయ్య, మాజీ రాష్ట్ర నాయకుడు బొడ్డు శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన

దిశ, తిరుమలగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని PDSU మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట నాగయ్య, మాజీ రాష్ట్ర నాయకుడు బొడ్డు శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ పేర్కొన్నారు. సూర్యాపేట డివిజన్ పరిధిలో జరిగిన 24వ మహాసభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీకరణను ప్రోత్సహిస్తూ విద్యార్థులను మతోన్మాదం వైపు నెడుతుందని విమర్శించారు. జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పీడీఎస్ యూ డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేసోజు మధు, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, లెనిన్, భార్గవ్, పవన్, ఆమనీ, చరణ్, సిద్దు, సైదులు పాల్గొన్నారు.






