ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ వైద్యం.. విధుల్లోకి వస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ లో కనిపిస్తున్నారు..

by Bhanu |

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యా పేట జిల్లా లో తనిఖీలు నిర్వహించి అర్హత లేని ప్రైవేట్ హాస్పిటల్స్ లో నీ డాక్టర్లను గుర్తించి పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ వైద్యం.. విధుల్లోకి వస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ లో కనిపిస్తున్నారు..
X

దిశ, సూర్యాపేట : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సూర్యా పేట జిల్లా లో తనిఖీలు నిర్వహించి అర్హత లేని ప్రైవేట్ హాస్పిటల్స్ లో నీ డాక్టర్లను గుర్తించి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హత లేని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ నీ సంబంధిత శాఖ సీజ్ చేసింది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొందరు వైద్యులు విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యo చేస్తున్న కొంతమంది డాక్టర్ల పై సంబంధిత శాఖ దృష్టి సాధించకపోవడం పై జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రిలో కొంతమంది డాక్టర్స్ ఉదయం ఆసుపత్రికి చేరుకుని హాజరు పట్టికలో సంతకo పెట్టి న తరువాత వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనీ, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది డాక్టర్స్ ప్రభుత్వ హాస్పటల్ లో నామమాత్రంగా పేషెంట్ల ను చూస్తూ, ప్రైవేట్ క్లినిక్ లోనే పూర్తి సమయం వెచ్చిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొంతమంది డాక్టర్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించవలసిన సమయం లో క్లినిక్ ల లో వైద్యం చేసుకుంటూ దండిగా డబ్బులు దండుకుంటున్నారనీ, ఆసుపత్రికి వచ్చిన రోగులకు సిబ్బందితో వైద్యం చేపిస్తూ, రోగులను తమ క్లినిక్ ల కు మళ్ళించుకుంటున్నారన్న వాదనలు లేకపోలేదు.


వీధుల పట్ల నిర్లక్ష్యం

జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో గత కొద్ది కాలంగా విధులు నిర్వర్తిస్తున్న కొత్తమoది డాక్టర్లు వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించవలసిన ఆ డాక్టర్లు అదే సమయంలో పట్టణంలోని తమ స్వంత హాస్పిటల్స్ కి వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఆ సార్లు హాస్పిటల్ల లో క్లినిక్ లలో ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం నిబంధనలకు విరుద్దంగా ఎవ్వరి పర్యవేక్షణ లేకుండా నర్సింగ్ విద్యార్థులు, నర్సులతో వైద్యం చెపిస్తున్నట్లు రోగులు చెప్తున్నారు.

ప్రధాన ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు సంబంధించిన పరికరాలు అనువైనవి లేవని, తమ హాస్పటల్ కి,క్లినిక్ కు రావాలని రోగులను ఏ మార్చుతూ తమ హాస్పిటల్స్ కి, క్లినిక్ ల కి రోగులను మల్లించుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

ప్రైవేటుకు వెళ్లాలంటూ సలహాలు..

సూర్యా పేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లాలని ప్రభుత్వ హాసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. సూర్యా పేట లో ఉన్న ప్రైవేట్ హాసుపత్రులు సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు కి చెందినవే. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి , అన్ని వసతులు ఏర్పాటు చేసిన ఇక్కడ కష్టం. ప్రైవేట్ హస్పత్రికి వెళ్లితే మంచిదని చెప్పి వారి సొంత ఆసుపత్రులకు రిఫర్లు చేస్తున్నారు. సూర్యాపేట ప్రభుత్వ హాసుపత్రికి బయట నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఇదే తరహాలో ప్రైవేట్ హాస్పత్రిలో ఓపీ బేసిక్ పద్ధతిలో ఒప్పందం కుదిరించుకుంటున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, పీడియాటిక్, గైనిక్, కార్డియాక్ డాక్టర్లు ఎక్కువ శాతం బయట ప్రైవేట్ హాస్పత్రికి మక్కవ చూపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యా పేట ప్రభుత్వ హసుపత్రి మెడికల్ కాలేజీలో ఉంటే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని పాలకులు చెబుతున్నా అలాంటి వైద్యం ఇక్కడ కనిపించడంలేదు.

సూర్యా పేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు బహిరంగంగా ప్రైవేట్ ఆస్పత్రి బోర్డులో పేర్లు రాయించుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పత్రులు యాజమాన్యం పీఆర్ఓల తో మార్కెటింగ్ చేసుకుంటూ దండిగా వ్యాపారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రంలో ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ లో ఓ రైతు కాలు విరిగింది. అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ప్రభుత్వ హాస్పటల్ ల్లోని డాక్టర్లు చికిత్స చేస్తుంటే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ డాక్టర్ నియమించుకున్న పిఆర్ ఓ వచ్చి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే ఎవరు పట్టించుకోరు విరిగిన కాలు కాస్త మొత్తం పోతుందని హాస్పిటల్ బయట ఉన్న వాళ్ళ బంధువులకి తియ్యటి మాటలు చెప్పి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కి తరలించారు. వారి మాట విన్న వారి బంధువులు కాలు విరిగిన అరైతుని హాస్పటల్ లో చేర్పించారు. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి మా దగ్గర డబ్బులు వసూలు చేశారని వారి బంధువులు తెలిపారు. ఇలా అత్యవసరమని వచ్చిన రోగులను ప్రభుత్వ హాస్పటల్ బయటనే మాట్లాడుకుని తమ ప్రైవేట్ హాస్పటల్లోకి కొంతమంది డాక్టర్లు పి ఆర్ ఓ ల ద్వారా తీసుకొని వెళ్లి ఇష్ట రాజ్యాంగ బిల్లులు వేస్తున్నారని జిల్లా ప్రజలు వాపోతున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు..

సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు బయట ఆస్పత్రుల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పనిచేస్తున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చాలా ఫిర్యాదులు వచ్చినా వారు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లపై దృష్టి సారించి వారి అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు.

ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లపై నిఘా ఉంచాం : డా. జనార్ధన్ సూర్యాపేట ప్రభుత్వ హాస్పటల్ పర్యవేక్షణ అధికారి(ఆర్ఎంఓ)..

ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లపై నిఘా ఉంచాం. ఎప్పటికప్పుడు హాస్పటల్లో వైద్యం చేస్తున్నారో లేదో పర్యవేక్షణ చేస్తున్నాం. తమ సమయం ప్రకారం డాక్టర్లు ప్రభుత్వ హాస్పటల్ కు వచ్చే రోగులకు అందుబాటులో ఉంటున్నారు. అలా ఎవరైనా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని మాకు ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లపై ఎలాంటి ఫిర్యాదు మాకు రాలేదు.

Next Story