- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సూర్యాపేట జిల్లా, మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం మట్టపల్లి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే.నరసింహ గురువారం పరిశీలించారు.

దిశ హుజూర్ నగర్ / మఠంపల్లి : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం సూర్యాపేట జిల్లా, మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం మట్టపల్లి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే.నరసింహతో కలిసి గురువారం పరిశీలించారు. డయాస్, ప్రముఖులు, ఇతరుల సీటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ఈడీ ల ఏర్పాటు, డయాస్ పక్కనే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాల ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్ర గవర్నర్ కు ఇచ్చే పోలీస్ గౌరవ వందనం, వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న స్టాల్స్, దేవాలయంలో డెకరేషన్ తదితర అన్ని ప్రదేశాలను కలెక్టర్ ,ఎస్ పి లు తనిఖీ చేయడమే కాకుండా అధికారులు, సిబ్బందికి తగు సూచనలను జారీ చేశారు.గవర్నర్ రాక సందర్బంగా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, గవర్నర్ మట్టపల్లి వచ్చినప్పటినుండి తిరిగి వెళ్ళిపోయే వరకు అన్ని సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్ర గవర్నర్ మట్టపల్లి సందర్శన సందర్బంగా హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 126 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కోదాడలో 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జవహర్ నవోదయ విద్యాలయ భవనానికి ,కోటి రూపాయల వ్యయంతో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న డార్మెటరీ, కిచెన్ షెడ్ మరియు తాగునీటి ట్యాంకుకు, అలాగే మరో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న యాత్రికా సదన్, పిపిజిఐ షెడ్డు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా దేవాలయ ఆవరణలో వ్యవసాయ, పౌరసరఫరాలు, ఉద్యాన, డిఆర్డిఏ ,విద్య, నీటిపారుదల, గృహ నిర్మాణ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ ను రాష్ట్ర గవర్నర్ సందర్శించనున్నారు. హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.






