గవర్నర్ పర్యటనలో అపశృతి.. తల పగిలి చేనేత కార్మికుడికి గాయాలు

by Bhanu |

భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చేనేత జోలి శాఖ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు.

గవర్నర్ పర్యటనలో అపశృతి.. తల పగిలి చేనేత కార్మికుడికి గాయాలు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని టూరిజం పార్కును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చేనేత జోలి శాఖ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది యాదగిరి గవర్నర్ పర్యటన సందర్భంగా టూరిజం పార్క్ కు అనుకుని ఉన్న వినాభా మందిరం దగ్గర కూర్చున్నాడు.

అయితే జనరేటర్ సహాయంతో విద్యుత్ సరఫరా చేసేందుకు వైర్లను వినోబా మందిరం గోడ పైనుండి టూరిజం పార్కులోకి అమర్చారు. గవర్నర్ పర్యటన ముగియనున్న సమయంలో విద్యుత్ సరఫరా నిర్వాహకులు వైరును లాగారు. అయితే వైర్ వేలాడకుండా గోడపై బండ రాయిని పెట్టారు. అది చూసుకోకుండా నిర్వాహకులు వైరును లాగడంతో పక్కనే ఉన్న చేనేత కార్మికుడికి పై పడింది.

దీంతో చింతకింది యాదగిరి తలకు తీవ్రంగా గాయమై రక్తస్తావరం జరిగింది .వెంటనే వైద్యాధికారులు తలకు ప్రథమ చికిత్స చేసి కట్టు కట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పర్యటన కోసం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు .


Next Story