- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్డేటి అక్కులు మృతి .. సీపీఎం కి తీరని లోటు
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : సీపీఎం నాయకుడు గుడ్డేటి అక్కులు మృతి పార్టీకి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పారేపల్లి శేఖర్

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : సీపీఎం నాయకుడు గుడ్డేటి అక్కులు మృతి పార్టీకి తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు అన్నారు. గురువారం పాలకవీడు మండలంలోని గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం నాయకుడు గుడ్డేటి అక్కులు మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పలువురు సీపీఎం నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు మాట్లాడుతూ జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామ సర్పంచ్ గా అక్కులు గ్రామాన్ని అభివృద్ధి చేశాడని తెలిపారు. ఆ పార్టీ సూర్యపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, దిద్దిగుంట్ల పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, తురికొండ వెంకటేశ్వర్లు, పాతూరి శ్రీనివాస్, కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, దోరేపల్లి వెంకటేశ్వర్లు, కాసాని వెంకన్న, దిద్దగుంట్ల రామిరెడ్డి, గుడ్డేటి నందయ్య పాల్గొన్నారు.






