- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఓ 252 ను వెంటనే సవరించాలి : టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్
దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జీవో ఎంఎస్ నెంబర్ 252ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని

దిశ, నల్లగొండ, కలెక్టరేట్ : జీవో ఎంఎస్ నెంబర్ 252ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే 143) జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డెస్క్ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన జీఓ 252లోని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. జీఓ 252లో స్పష్టతలేని నిబంధనలు, అక్రిడిటేషన్లలో భారీ కోతలు, మీడియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో గందరగోళం, రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేబుల్ ఛానెల్స్, పార్ట్‌టైం రిపోర్టర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా జీ ఓ 252ను పునఃసమీక్షించి సవరించాలన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమస్త జర్నలిస్టుల హక్కుల కోసం యూనియన్లకు అతీతంగా, ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. జర్నలిస్టులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగానికైనా జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారు. జీ ఓ 252లో గజిబిజి నిబంధనలతో జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. ‘మీడియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు’ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం అనే స్పష్టత లేదని విమర్శించారు. కొత్త నిబంధనలతో 10 వేలకుపైగా అక్రిడిటేషన్ల కోత పడే ప్రమాదం ఉందని, రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కేబుల్ ఛానెల్స్, పార్ట్‌టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరగనుందని, ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనుభవం 10 నుంచి 15 ఏళ్లకు పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్న జీ ఓ 252ను వెంటనే సవరించాలని, ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనలకు వేనకాడేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.






