ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వండి

by Disha Web Desk 22 |
ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వండి
X

దిశ, నేరేడుచర్ల: హుజుర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణంలో ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు శాశ్వత పట్టాలివ్వాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలను ఇవ్వాలని సీపీఐ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు గోకినేపల్లి వేంకటేశ్వర రావులు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు గోకినేపల్లి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ… గత ఏడు సంవత్సరాల నుంచి నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 243, 244 లో నిలువ నీడ లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు పట్టాలు ఇవ్వాలని అనేకమార్లు కలెక్టర్లను, సంబంధిత అధికారులను, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కలిసి వినతి పత్రాలు అందించినట్లు తెలిపారు.

అప్పటి ప్రభుత్వం అధికారులు పేదల వేసుకున్న గుడిసెల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వేసుకున్న గుడిసెలను తొలగించి పేదలపై వారికి అండగా ఉన్న నాయకుల పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు ఇంటి స్థలం ఇచ్చి,ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తానన్న హామీ మేరకు ఎప్పటి నుంచో నేరేడుచర్ల ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని నివాసముంటున్న 250 కుటుంబాల వారికి వర్తించేలా చేసి, స్థలాలకు పట్టాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, హుజుర్ నగర్ డివిజన్ కన్వీనర్ వాస పళ్ళయ్య, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్ డి. హుస్సేన్, పీవీఎల్ జిల్లా నాయకులు వాస కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed