Nagarjuna Sagar: రేపు నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్

by Disha Web Desk 13 |
Getting huge inflow, Nagarjuna Sagar Dam Gates to be lifted on August 11
X

దిశ, నాగార్జునసాగర్ : Getting huge inflow, Nagarjuna Sagar Dam Gates to be lifted on August 11| నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. జలాశ నీటిమట్టం గరిష్ట సాయికి చేరుతుండడంతో గురువారం ఉదయం 6:30 గంటలకు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు డ్యాం ఎస్ ఇ ధర్మ తెలిపారు. నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ తో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి ప్రస్తుతం జలాశయానికి 1,75,272లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 31,849 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 580 అడుగుల మేర నీరున్నది. డ్యామ్‌ గరిష్ఠ నిల్వసామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 283.01.60 టీఎంసీల మేర నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 25,818 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు 2570 క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి సపోర్ట్ నాకే.. పాల్వాయి స్రవంతి కీలక వ్యాఖ్యలు




Next Story

Most Viewed