‘జై శ్రీరామ్’ నినాదంతో పరీక్షల్లో పాస్.. ప్రభుత్వం రియాక్షన్ ఇదే..! ఆన్సర్ షీట్స్ వైరల్

by Disha Web Desk 7 |
‘జై శ్రీరామ్’ నినాదంతో పరీక్షల్లో పాస్.. ప్రభుత్వం రియాక్షన్ ఇదే..! ఆన్సర్ షీట్స్ వైరల్
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో చాలా మంది పరీక్షల్లో సొంత ప్రతిభను చూపిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెయ్యకుండా.. నచ్చిన జవాబులు రాయడంతో జీరో మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నో ఆన్సర్ షీట్స్ సైతం నెట్టింట వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వార్తనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జౌన్‌పూర్‌లోని ఓ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న 18 మంది విద్యార్థులు తమ ఆన్సర్ షీట్‌లపై జై శ్రీరామ్ అనే నినాదంతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్ల పేర్లను రాశారు. అంతే కాకుండా అలా రాసి పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించారు. అయితే.. వాళ్లు ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థుల నుంచి కొంత మంది ప్రొఫెసర్లు లంచాలు కూడా తీసుకున్నారని తెలుస్తోంది. విద్యార్థుల ఆన్సర్ షీట్‌కు సంబంధించిన ఫొటోలు, ప్రొఫెసర్లు లంచాలు తీసుకున్న బ్యాంకు డిటేల్స్‌కు సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

దీనిపై వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీకి చెందిన ఓ మాజీ విద్యార్థి ఆర్టీఐ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతుండగా.. అప్పుడు కంప్లైంట్ చెయ్యడంతో విచారణ జరిగింది. దీనిపై విచారణ జరగ్గా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ప్రొఫెసర్‌లను అప్పుడు సస్పెండ్ చేశారు. ఇక వారి పూర్తి తొలగింపుపై ఫైనల్ జడ్జ్‌మెంట్ కోసం విశ్వవిద్యాలయం ఇప్పుడు గవర్నర్ ఆదేశం కోసం వేచిచూస్తుండగా.. మరోసారి ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.



Next Story

Most Viewed