ఉచ్చ పోసుకున్న ప్యాంట్ల మీద ముచ్చటపడుతున్న కుర్రాళ్లు.. లక్షలు ఇచ్చి మరీ కొంటున్నారు అక్కడ...

by Sujitha |
ఉచ్చ పోసుకున్న ప్యాంట్ల మీద ముచ్చటపడుతున్న కుర్రాళ్లు.. లక్షలు ఇచ్చి మరీ కొంటున్నారు అక్కడ...
X

దిశ, ఫీచర్స్ : పిచ్చి వెయ్యి రకాలు అంటారు. కానీ అది స్టేటస్‌ను బట్టి మారుతుంది. పేదవాళ్లు చేస్తే మెంటల్ అంటే డబ్బున్న మహారాజులు చేస్తే ట్రెండ్ అంటారు. ఇలాంటి కోవలోకి చెందినదే లేటెస్ట్ ఫ్యాషన్ ఐడియా. ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్‌లో ఫ్యాషన్ రోజుకో రకంగా మారిపోతుంది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ బ్రాండ్ Jordanluca.. సరికొత్త ఐడియాతో వచ్చింది. ప్రైవేట్ పార్ట్ దగ్గర మూత్రం మరకలున్న డెనిమ్ జీన్స్ ఇంట్రడ్యూజ్ చేసింది. చూసేందుకు యూరిన్ చేసుకున్నట్లు కనిపిస్తుండగా.. ధర ఏకంగా రూ. 70వేలు కావడం విశేషం.


అయితే ఈ బ్రిటిష్ - ఇటాలియన్ బ్రాండ్‌కు ఫారిన్‌లో బాగానే డిమాండ్ ఉన్నా.. ఇండియా యూత్ మాత్రం దీన్ని కూడా ఫ్యాషన్ అంటారా అని నోరెళ్లబెడుతున్నారు. పైగా అంత డబ్బు పెట్టి ఎందుకు కొనాలని అడుగుతున్నారు. దీనికి బదులు ఎవరి ప్యాంట్లపై వాళ్లు యూరిన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని కొందరు అంటుంటే.. ఇలాంటివి చిన్నప్పుడే చేశామని ఇంకొందరు కామెంట్ చేశారు.

Next Story

Most Viewed