- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
by Bhanu |
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో జరిగింది.

X
దిశ, గరిడేపల్లి : ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం రాయినిగూడెం గ్రామానికి చెందిన గుండు మహేష్ (36) గత కొన్ని సంవత్సరాల నుంచి కీతవారి గూడెం లోని హెచ్.పి పెట్రోల్ బంక్ లో పని చేస్తూ మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు.
దీంతో పిల్లల చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ జీవితం పై విరక్తి చెంది ఉదయం 8 గంటల సమయంలో భార్య షాప్ వద్దకు వెళ్లి వచ్చేసరికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య గుండు సంధ్యావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు.
Next Story






