అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, నేరేడుగొమ్ము : కాంగ్రెస్ మాజీ స‌ర్పంచ్, ఎమ్మార్పిఎస్ సీనియ‌ర్ నాయ‌కులు పంది శ్రీను అనారోగ్యం కార‌ణంగా మృతి చెందాడు. ఈ విష‌యం తెలుసుకొని కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల వారి

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్
X

దిశ, నేరేడుగొమ్ము : కాంగ్రెస్ మాజీ స‌ర్పంచ్, ఎమ్మార్పిఎస్ సీనియ‌ర్ నాయ‌కులు పంది శ్రీను అనారోగ్యం కార‌ణంగా మృతి చెందాడు. ఈ విష‌యం తెలుసుకొని కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల వారి స్వగృహానికి వచ్చి భౌతిక కాయానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్, మద్దిమడుగు రామస్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీను కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారికీ ఎల్లవేళలా అండగా ఉంటామని, శ్రీను మృతి సమాజానికి MRPS ఉద్యమానికి తీరని లోటని, సామాజిక కార్యక్రమాలకు ముందుండే నాయకుడన్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి అని.. ఇవాళ ఆయ‌న‌ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

Next Story