దమ్ముంటే కేసీఆర్.. అక్కడ నాపై పోటీ చేసి గెలవాలి : Komatireddy Raj Gopal Reddy

by Vinod kumar |   (  Updated:2022-09-08 13:09:09  IST  )

మూడు సంవత్సరాలుగా కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ - Former MLA Komatireddy Rajagopal Reddy comments on cm kcr

దమ్ముంటే కేసీఆర్.. అక్కడ నాపై పోటీ చేసి గెలవాలి : Komatireddy Raj Gopal Reddy
X

దిశ, మునుగోడు: మూడు సంవత్సరాలుగా కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కేసీఆర్ వివక్షత చూపాడని తెలంగాణ కేసీఆర్ కుటుంబ జాగిరా అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం మండల పరిధిలోని గూడ పూర్, కొరటికల్, చీకటిమామిడి, కొంపెల్లి, మునుగోడు గ్రామాలలో ఆయన పర్యటించారు. కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక ఎనిమిదిన్నర సంవత్సరాల సీఎం కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా జరిగే ఎన్నిక అన్నారు.


మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గా తను ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించక పోవడంతో నేను నిత్యం కుంగిపోయానన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతర ప్రాంతాల పై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడన్నారు. సీఎం కేసీఆర్ వారితోపాటు తనను కూడా టీఆర్ఎస్‌లోకి రమ్మన్నాడని వస్తే సబితా ఇంద్రారెడ్డి తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తానని ఆశ చూపిన తనకు పదవులు అవసరం కాదని, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు లక్ష్యమన్నారు.

18 నెలలు ఎమ్మెల్యే పదవికి అవకాశం ఉన్న తన రాజీనామాతో నైన ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి రాజీనామా చేశానని, తన రాజీనామాతోనే కేసీఆర్‌కు కనువిపు అయ్యి ఫామ్‌ హౌస్‌లో ఉండే కేసీఆర్ మునుగోడుకు వచ్చాడని, 10 లక్షల మందికి పెన్షన్, మూడో విడత గోర్లు, చేనేత కార్మికులకు భీమా అమలు చేశాడన్నారు. ఇటీవల జరిగిన కేసీఆర్ సభలో అభ్యర్థిని ప్రకటించకపోవడం ఇక్కడి ప్రజలు అంటే కేసీఆర్ కి భయమన్నారు. మునుగోడు ప్రజల తీర్పుపై ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలన్నారు.


టీఆర్ఎస్‌కు పోయిన సర్పంచులు అక్కడ ఇమిడి ఉండలేక తన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు ఉప ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి సురేందర్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు దర్శనం వేణు కుమార్, మందుల బీరప్ప, అయితగోని యాదయ్య గౌడ్, కేవీ ఉదయ కృష్ణ, బండారు యాదయ్య, గుజ్జ కృష్ణ, కంభంపాటి నరసింహ, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story