- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్తం గూటికి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్
భువనగిరి కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. భువనగిరి మున్సిపాలిటీ 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ నాయకుడు లయిఖ్ అహ్మద్ అధికార పార్టీని వీడి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హస్తం గూటికి చేరారు. ఆయనతో పాటు హుస్నాబాద్ కి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు తుమ్మెటి పాండు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు పూర్తిన్యాయం జరుగుతుందని చెప్పారు. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో అహ్మద్ బబ్బు, తుమ్మెటి వెంకటేష్, పల్లపు గణేష్, మర్రి అశోక్, ఆకుల వెంకటేష్ మందాసు సుదర్శన్ మరి కొంత మంది కాంగ్రెస్ లో చేరారు.






