- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చటగా మూడోసారి మహిళలకే కోదాడ చైర్మన్ పీఠం
కోదాడ మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి మహిళలదే పైచేయి సాధించారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి వరుసగా మూడోసారి చైర్మన్ పీఠం మహిళలకే దక్కనుంది.

దిశ, కోదాడ : కోదాడ మున్సిపల్ రాజకీయాల్లో మరోసారి మహిళలదే పైచేయి సాధించారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి వరుసగా మూడోసారి చైర్మన్ పీఠం మహిళలకే దక్కనుంది. తాజాగా విడుదలైన 2026 మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ జాబితాలో కోదాడ చైర్మన్ స్థానం ‘జనరల్ మహిళ’గా ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.ఇది యాదృచ్ఛికం కాదు… కోదాడ చరిత్రే ఇందుకు సాక్ష్యం.
2014లో బీసీ మహిళ
2019లో జనరల్ మహిళ
2026లో మళ్లీ జనరల్ మహిళ
మహిళలకే చైర్మన్ పీఠం ఖాయం కావడంతో ఆశావహ నేతల గుండెల్లో ఆశలు, భయాలు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా చైర్మన్ కుర్చీ కోసం రాజకీయ పావులు కదులుతున్నాయి.ప్రత్యేకంగా అధికార పార్టీలో మాత్రం పరిస్థితి మరింత వేడెక్కింది. ఆశావహ మహిళా నేతలు ఇప్పటికే తమ బలాబలాలను లెక్కించుకుంటూ రంగంలోకి దిగగా, స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్గ పెద్దల ఆశీస్సులు ఎవరికి పడతాయన్నదే కీలక ప్రశ్నగా మారింది. ఒక్క సిగ్నల్‌తో రాజకీయ సమీకరణాలు తారుమారు అయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవడం లేదు. సరైన మహిళా అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో ఈసారి కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు మామూలుగా ఉండవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మొత్తానికి, మహిళలకు వరుసగా మూడోసారి దక్కుతున్న చైర్మన్ పీఠం కోదాడను మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చింది. ఇక అసలు ప్రశ్న ఒక్కటే ఆ కుర్చీపై కూర్చోబోయే మహిళ ఎవరో అని చర్చ జరుగుతోంది.






