- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం: భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు
మండల పరిధి కుక్కడం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, మాడుగులపల్లి: మండల పరిధి కుక్కడం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ధైద వెంకన్న, భార్య లక్ష్మిరేఖ (32)తో కలిసి ద్విచక్ర వాహనంపై నల్లగొండ పట్టణంలో ఇంటర్ చదువుతున్న తమ కూతురును చూడడానికి మిర్యాలగూడ నుంచి నల్లగొండ వెళుతున్నారు.
ఈ క్రమంలో కుక్కడం వద్దకు రాగానే వెనక వైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో పాటు కొంత దూరం లాక్కెళ్లింది. దీంతో భార్య లక్ష్మిరేఖ అక్కడికక్కడే మృతిచెందగా, వెంకన్నకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108 సాయంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






