- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కోసం తిప్పలు... బారులు తీరిన రైతులు
by velandi.Saikiran |
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గత వారం రోజులుగా యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు

X
దిశ, హాలియా: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గత వారం రోజులుగా యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కొత్తపల్లి సహకార సంఘం వద్ద తెల్లవారుజాము నుండి రైతులు వందలాదిగా క్యూ లైన్ లో నిలుచున్నారు. సంఘానికి ఆదివారం 40 టన్నుల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. తెల్లవారుజామున 2 గంటల నుండి రైతులు క్యూ లైన్ లో నిల్చుని యూరియా కోసం బారులు తీరారు. స్టాక్ వచ్చినా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చినట్లు సంఘం అధికారులు తెలిపారు. కానీ రైతులకు అవి సరిపోవడంలేదు. దింతో యూరియా కోసం సహకార సంఘాలకు వెళుతున్నారు.
Next Story






