యూరియా కోసం రైతుల ధర్నా ..

by Elthuri vijay kumar |

యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం కొత్తపల్లి సహకార సంఘం భవనం ఎదుట రైతులు ధర్నాకు దిగారు.

యూరియా కోసం రైతుల ధర్నా ..
X

యూరియా కోసం రైతుల ధర్నా ..

- హాలియా- నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు

దిశ, హాలియా: యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం కొత్తపల్లి సహకార సంఘం భవనం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. హాలియా- నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై సుమారు గంటసేపు రాకపోకలు స్తంభించాయి. యూరియా కోసం ప్రతి రోజు ఎదురుచూడాల్సి వస్తుందని అదును దాటిపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్ దుకాణదారులకు యూరియా కేటాయించినప్పటికీ వ్యాపారులు యూరియాను బ్లాక్ లో రూ.350 నుండి రూ.400 వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది రైతులకు మాత్రమే యూరియా ఇచ్చి మిగతా రైతులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ధరలు తీసుకుంటున్నప్పటికీ యూరియాకు గుళికలు అంటగడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇతర మండలాల నుండి రైతులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మండల రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీసులు రైతులకు నచ్చ చెప్పి ధర్నాను విరమింపజేశారు.

Next Story