- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య యత్నం
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మేఘ్య తండా గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, పెన్ పహాడ్ : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మేఘ్య తండా గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై కస్తాల గోపికృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన ఆంగోతు నాగేశ్వరరావు (38) తనకున్న రెండు ఎకరాల 20 గుంటల భూమిని సాగు చేసి సాగునీరు అందకపోవడంతో పంట చేతికందక ఎండిపోయిందని అప్పుల బాధలు తట్టుకోలేక, దిక్కు తోచని స్థితిలో మనస్థాపానికి గురై ఈనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మృతుడు తన తల్లికి తెలియజేయడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు మృతుని భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






