- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు: ఎక్సైజ్ ప్రొహిబిషన్ సీఐ రజిత
నాటు సారా తయారీ, అమ్మకాలు, మద్యం తరలింపు తదితర అంశాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టి, కేసులు నమోదు చేస్తున్నామని తుంగతుర్తి ఎక్సైజ్ ప్రొహిబిషన్ సీఐ ఏ.రజిత వెల్లడించారు. ఈనెల 11న నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం ఆమె "దిశ"తో మాట్లాడారు.

దిశ, తుంగతుర్తి: నాటు సారా తయారీ, అమ్మకాలు, మద్యం తరలింపు తదితర అంశాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టి, కేసులు నమోదు చేస్తున్నామని తుంగతుర్తి ఎక్సైజ్ ప్రొహిబిషన్ సీఐ ఏ.రజిత వెల్లడించారు. ఈనెల 11న నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం ఆమె "దిశ"తో మాట్లాడారు. సిబ్బంది తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతి మండలంలో సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి నేటి వరకు వివిధ రకాలుగా 41 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుల వద్ద నుంచి 29 లీటర్ల నాటు సారా, 4 వేల 800 లీటర్ల బెల్లం పానకం, 63 లీటర్ల మద్యం, 130 లీటర్ల బీరుతో పాటు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.8.39 లక్షలుగా ఉంటుందని తెలిపారు. మరో రెండు రోజులపాటు ఈ దాడులు కొనసాగుతాయని ఆమె వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లో నాటు సారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణలాంటి వన్నీ చట్టరీత్యా నేరం అన్నారు. కార్యక్రమంలో ఎస్సై మూర్తి పాల్గొన్నారు.






