కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య

by Ratna Kumari |

దిశ, నూతనకల్ : రాబోయే మున్సిప‌ల్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు

కాంగ్రెస్  గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య
X

దిశ, నూతనకల్ : రాబోయే మున్సిప‌ల్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు గుడిపాటి న‌ర్స‌య్య సూచించారు. బుధ‌వారం నూత‌న‌క‌ల్ మండ‌ల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బలోపేతం కొరకు కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉందని, నియోజకవర్గంలో నాయకులు కో-ఆర్డినేషన్ తో పని చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. నాయకుల మధ్య విభేదాలు లేకుండా కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ నాయకుల మధ్య వర్గ భేదాలు లేవని ఎమ్మెల్యే, ఎంపీ,డీసీసీ అధ్యక్షులు సమిష్టిగా ఉన్నామని మండల, గ్రామ స్థాయి వరకు కోఆర్డినేషన్ తో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నాగం జయసుధ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల నాగమల్లు, కాంగ్రెస్ సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Next Story