- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్
దిశ, గుర్రంపోడు : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 'జిమ్ మై ఫిట్నెస్' హెల్త్ క్లబ్ నూతనంగా ప్రారంభమైంది. స్థానిక యువతలో

దిశ, గుర్రంపోడు : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 'జిమ్ మై ఫిట్నెస్' హెల్త్ క్లబ్ నూతనంగా ప్రారంభమైంది. స్థానిక యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తిని పెంచే లక్ష్యంతో నాంపల్లి రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం. నేటి బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. గుర్రంపోడులో ఇలాంటి మంచి సదుపాయం అందుబాటులోకి రావడం సంతోషకరం," అని పేర్కొన్నారు. జిమ్ యజమాని బొడ్డుపల్లి ప్రవీణ్ మాట్లాడుతూ, సభ్యులకు మెరుగైన శిక్షణ, నాణ్యమైన పరికరాలు అందిస్తామని తెలిపారు. అలాగే, 'ఫ్రెండ్స్ ఫిట్నెస్ దేవరకొండ' యజమాని సాబేరు మాట్లాడుతూ, "ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఫిట్‌నెస్‌కు కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ కొత్త జిమ్ ద్వారా గుర్రంపోడు ప్రజలకు ఆ అవకాశం లభించడం సంతోషకరం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి జిమ్‌లు దోహదపడతాయి," అని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రంపూడు మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, కుప్ప అమరేందర్, మదర్ష, ఫ్రెండ్ ఫిట్నెస్ దేవరకొండ యజమాని సాబేరు, షరీఫ్, సైదులు, అబ్బాస్, రాఖి, గని, స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






